నేతలంతా సమన్వయంతో పని చేయాలి

నేతలంతా సమన్వయంతో పని చేయాలి

మునుగోడు అసంతృప్త నేతలతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మునుగోడు నేతలను ఆయన కలిశారు. టికెట్ ఆశించి భంగపడ్డ చలమల కృష్ణారెడ్డి, పల్లె  రవికుమార్ గౌడ్, కైలాష్ కు తాజా పరిస్థితులను వివరించారు.

కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పాల్వాయి స్రవంతి ఎంపిక వెనక ఉన్న ఉద్దేశం నేతలకు వివరించారు. సిట్టింగ్ సీటును కాపాడుకునే విధంగా నేతలంతా సమన్వయంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.