మేడారం గద్దెలను దర్శించుకున్న రేవంత్ రెడ్డి

మేడారం గద్దెలను దర్శించుకున్న రేవంత్ రెడ్డి

‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర ప్రారంభానికి ముందు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేడార్ గద్దెలను దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న ఆయనకు ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ  ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ వనదేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం నుంచి హాత్ సే హాత్ జోడో ను యాత్రను రేవంత్ మరికాసేపట్లో మొదలు పెట్టనున్నారు. ఈ యాత్రలో ఆయనతో పాటు ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఈ నెల 22 వరకు తొలి విడుత పాదయాత్ర జరగనుంది. అంతకు ముందు పాద యాత్ర కోసం ఇంటి నుంచి బయలుదేరిన  రేవంత్ రెడ్డికి ఆయన కూతురు నైమిష హారతి ఇచ్చి పంపారు.