సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పున్న

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పున్న

మునుగోడు, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ నేత మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా భువనగిరి, నల్గొండ ఎంపీ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ శైలి గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.

రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేస్తుందని సీఎంతో చెప్పానని పున్న వెల్లడించారు. కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటున్నానని సీఎం చెపారన్నారు.