కల్వకుంట్ల కనస్ట్రక్షన్స్ సమర్పించు : ట్విట్టర్​లో టీపీసీసీ పోస్టర్

కల్వకుంట్ల కనస్ట్రక్షన్స్ సమర్పించు : ట్విట్టర్​లో టీపీసీసీ పోస్టర్
  • ‘మేడిగడ్డ’... బాగా మేశినవ్ బిడ్డా..!!


 హైదరాబాద్​: ప్రాజెక్టుల విషయంలో అధికార కాంగ్రెస్​, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం తారస్థాయికి చేరింది.  ట్విట్టర్ వేదికగా కల్వకుంట్ల కన్స్‌ట్రక్షన్స్ సమర్పించు ‘మేడిగడ్డ’ అనే టైటిల్ పెట్టి కేటీఆర్, కేసీఆర్  ఉన్న ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.  దీనికి‘బాగా మేశినవ్ బిడ్డా..!!’ అనే ట్యాగ్​లైన్​ ఇచ్చింది. 

‘బాగా మేశినవ్ బిడ్డా’

‘మేత మేసిన మేడిపండ్లన్నీ మేడిగడ్డకు బయల్దేరినయ్..!! కాగ్‌కు ఏం తెలుసు కాకరకాయ. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులకేం తెలుసు అరటికాయ.. అన్ని బీఆర్ఎస్ బిల్డప్ బాబాయ్ లకే తెలుసు. అసలే వాళ్ళ నేత 80,000 పైగా పుస్తకాలు చదివిండాయె. ఇప్పుడు ఆ బ్రహ్మ జ్ఞానంతో ఇక్కడ బ్రహ్మాండం చెయ్యబోతున్నారు. ఆ బ్రహ్మాండమెందయ్య అంటే.. ఎక్కడో ఒక చోట కూల్ గా సెల్ఫీ తీసుకొని కూలలేదు, కుంగలేదు అంటే అయిపాయె. సిగ్గుండాలే బీఆర్ఎస్.. అదే ఉంటే అందరితో వచ్చేది. అది లేకనే ఇలా దొంగల్లా వచ్చింది.’ అంటూ ట్విట్టర్‌లో టీపీసీసీ పోస్ట్​ చేసింది