మోస్రా రామాలయంలో పీసీసీ అధ్యక్షుడి పూజలు

మోస్రా రామాలయంలో పీసీసీ అధ్యక్షుడి పూజలు

వర్ని, వెలుగు: నిజామాబాద్​ జిల్లా మోస్రా మండల కేంద్రంలోని ప్రసిద్దిగాంచిన సీతారామా ఆలయాన్ని ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్​గౌడ్​ సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. వేద పండితులైన శ్రీనివాసచారి, నవీన్​ పంతులు వేద మంత్రోచ్చరణలతో మహేశ్​కుమార్​గౌడ్‌తో ప్రత్యేక పూజలు చేయించారు. రాష్ర్టం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు. 

జిల్లా నాయకులు రాజశేఖర్​గౌడ్​, సత్యనారాయణగౌడ్​, వర్ని మార్కెట్​ కమిటీ వైస్​ చైర్మన్​లక్ష్మణ్, మండల సీనియర్​ నాయకులు హరినారాయణ, పిట్ల శ్రీరాములు, బోధన్​ మండల నాయకులు శరత్​రెడ్డి,రవీందర్​రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ మందిరంలో మహేశ్​గౌడ్​ పూజలు

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ మందిరంలో ఆదివారం టీపీసీసీ ప్రెసిడెంట్​మహేశ్​కుమార్​గౌడ్​ పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలు ఆయనకు డప్పులతో ఘన స్వాగతం పలకగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. టీపీసీసీ జనరల్​సెక్రెటరీ రాంభూపాల్, శేఖర్​గౌడ్, విపుల్​గౌడ్, ఆలయ చైర్మన్ ప్రమోద్, రాకేశ్​ తదితరులు ఉన్నారు.