షాద్ నగర్, వెలుగు: మున్సిపాలిటీ పన్నుల వసూలుపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ విమర్శించారు. ఆదివారం షాద్ నగర్ మున్సిపాలిటీలోని ఏడో వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఇల్లు కట్టుకుంటే చాలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని.. ఇవ్వకుంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇంటిపన్నులు వసూలు చేస్తూ.. నిధులను ప్రజాప్రతినిధులే కాజేస్తున్నారని, ఏ కాలనీ వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు గద్దె దింపడం ఖాయమన్నారు. అనంతరం ప్రజా గాయకుడు గద్దర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

