కాంగ్రెస్ కు భారీ మెజారిటీ ఇయ్యాలి:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్

కాంగ్రెస్ కు భారీ మెజారిటీ ఇయ్యాలి:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  అంజన్ కుమార్ యాదవ్

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ ఇవ్వాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ కోరారు. మంగళవారం (సెప్టెంబర్ 03) యూసఫ్ గూడలో డివిజన్​ఇన్​చార్జ్​ఫిరోజ్ ఖాన్​తో కలిసి ఆయన పర్యటించారు. 

ఈ సందర్భంగా డివిజన్ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నిజాముద్దీన్, లియకత్ అలీ, రాము, సుమన్ ఠాకూర్, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.