సంగారెడ్డికి మంజీర నీరు సరఫరా చేయాలి : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డికి మంజీర నీరు సరఫరా చేయాలి :  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి మున్సిపాలిటీకి మంజీర నీరు సరఫరా చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుక్రవారం కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. టీజీ ఐఐసీ చైర్ పర్సన్ నిర్మలతో కలిసి మున్సిపాలిటీకి నీటి సరఫరాపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలని జగ్గారెడ్డి కలెక్టర్ ను కోరారు. 2004లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి సహకారంతో సంగారెడ్డి పట్టణానికి మంజీర వాటర్ స్కీమ్ తెచ్చానని గుర్తు చేశారు.

 అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ.. వాటర్ బెడ్ కు సంబంధించి ఏడాదికి ఒకసారి టెండర్ పిలవాలని అధికారులకు సూచించారు. సెప్టెంబర్ 2న మహబూబ్ సాగర్ బ్యూటిఫికేషన్ విషయంలో రివ్యూ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్ అభివృద్ధి కోసం రూ.3 కోట్లు ఇచ్చేందుకు మునిసిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అంగీకరించారని జగ్గారెడ్డి చెప్పారు. 3న కలెక్టర్ తో కలిసి రాజీవ్ పార్కును సందర్శించనున్నట్లు తెలిపారు.