నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నం..తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ

నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నం..తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ

బషీర్​బాగ్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్​కు మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రజా రాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిలుకర రవి కుమార్ తెలిపారు. 

మంగళవారం బషీర్‌‌బాగ్ ప్రెస్ క్లబ్​లో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అగ్రకులాలకు టికెట్లు కేటాయించి బీసీలకు వ్యతిరేకంగా ముద్ర వేసుకున్నాయన్నారు. కాంగ్రెస్ బీసీకి టికెట్ ఇచ్చి సామాజిక న్యాయాన్ని పాటించిందన్నారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అండగా నిలవాలని కోరారు.