వరద పారుతున్నా.. వాగును తోడేస్తున్నరు!

వరద పారుతున్నా.. వాగును తోడేస్తున్నరు!

మంచిర్యాల, వెలుగు : ఇటీవల కురిసిన వానలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగుకు వరద పోటెత్తింది. ప్రస్తుతం ప్రవాహం కొద్దిగా తగ్గడంతో ఇసుక రవాణాదారులు వాగుపై వాలిపోయారు. ఎక్కడికక్కడ ఇసుక మేటలు వేయడంతో ట్రాక్టర్లను నేరుగా వాగులోకి తెచ్చి ఇసుకను తోడేస్తున్నారు. నీటిని సైతం లెక్క చేయకుండా ట్రాక్టర్లలో నింపుతున్నారు. ఒక్కో ట్రిప్పును రూ.3వేలు చొప్పును అమ్ముకుని క్యాష్ ​చేసుకుంటున్నారు.

మూడ్రోజులుగా రంగంపేట కాజ్ వే సమీపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. ట్రాక్టర్ల మోతతో మధ్యాహ్నం టైంలో నిద్ర కూడా పట్టడం లేదని అక్కడికి దగ్గరలోని లక్ష్మీనగర్​వాసులు చెబుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.