అమెరికాతో వాణిజ్య ఒప్పందం సులభం కాదు

అమెరికాతో వాణిజ్య ఒప్పందం సులభం కాదు

అమెరికాతో వాణిజ్య ఒప్పందం అంత సులభంగా కుదరదని అన్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఇది ఎంతో కష్టతరమైన విషయని..అనేక చిక్కులు పరిష్కరించాల్సి ఉందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్..భారత్, అమెరికా దేశాలు ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. వాణిజ్యపరంగా ఉన్న అభిప్రాయబేధాలు తొలగిపోవటానికి కొంత సమయం పట్టచ్చని తెలిపారు. భారత్ ,అమెరికాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశించటానికి ఎటువంటి బలమైన కారణం కనిపించడం లేదంటూ అమెరికా కామర్స్ సెక్రెటరీ విల్బర్ రాస్ కామెంట్ చేశారు. ఈ క్రమంలో మంత్రి జైశంకర్  ఈ వ్యాఖ్యలు చేశారు.