విదేశాలకూ విస్తరిస్తాం.. మినిస్టర్ వైట్ క్లాతింగ్ ప్రకటన

విదేశాలకూ విస్తరిస్తాం.. మినిస్టర్ వైట్ క్లాతింగ్ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: సంప్రదాయ దుస్తుల బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్టర్ వైట్ క్లాతింగ్ దేశవిదేశాల్లో పెద్ద ఎత్తున విస్తరిస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన 55వ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లూజివ్ బ్రాండ్ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను (ఈబీవో) ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది.  కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సురేష్ రామసుబ్రహ్మణియం మాట్లాడుతూ తమకు దేశవ్యాప్తంగా 5,000కు పైగా మల్టీ-బ్రాండ్ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్లు ఉన్నాయని తెలిపారు.

2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి 100 ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లూజివ్ బ్రాండ్ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్లను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉత్తర భారతదేశంలో వ్యాపారాన్ని బలోపేతం చేస్తామని, అమెరికా, యూకే, మిడిల్​ఈస్ట్​, దక్షిణాసియా మార్కెట్లకు వెళ్తామని ప్రకటించారు. తాము పంచెలు, కాటన్ ఆర్ట్ సిల్క్ షర్ట్స్​, షర్ట్–పంచె కాంబోలు, పండుగల కుర్తాలు, పిల్లల దుస్తులు అమ్ముతామని తెలిపారు.