సికింద్రాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం మధ్యాహ్నం నుంచి మహిళా సదస్సు జరగనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు పంజాగుట్ట-బేగంపేట్-పరేడ్ గ్రౌండ్స్ రూట్‌తో సహా 14 కీలక జంక్షన్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని.. ఈ విషయాన్ని గమనించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
టివోలి ప్లాజా రోడ్డు మూసివేత ఉండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు, మెట్రో వినియోగించాలని, అత్యవసర సహాయానికి 8712662999 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
