ట్రాఫిక్​లో డ్యాన్స్ ​​..సోషల్​ మీడియాలో వైరల్​

ట్రాఫిక్​లో డ్యాన్స్ ​​..సోషల్​ మీడియాలో వైరల్​

ఫుల్​ ట్రాఫిక్​.. అప్పుడే రెడ్​ సిగ్నల్​ పడింది. వెంటనే బైక్​ మీద నుంచి ఓ యువకుడు కిందికి రోడ్డు మీద డాన్స్​ చేస్తున్నాడు. మళ్లీ గ్రీన్​ సిగ్నల్​ పడేవరకు అక్కడున్నవాళ్ల చూపును తనవైపు నుంచి తిప్పుకోనీయకుండా చేశాడు... ఇలాంటి వీడియోలు ఆ మధ్య సోషల్​ మీడియాలో బాగా వైరల్​ అయ్యాయి. కానీ.. అలా డాన్స్​ చేసిన వ్యక్తి ఎవరనేది చాలామందికి తెలియదు. అతని పేరు సుబోధ్ లోంధే. ట్రాఫిక్​ రూల్స్​ గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే అలా డాన్స్​ చేస్తుంటాడు. 

సుబోధ్ లోంధే ఇప్పుడు ఫేమస్​ యూట్యూబర్. సోషల్ మీడియా స్టార్. అయితే.. అతన్ని స్టార్​ని చేసింది మాత్రం అతని మంచితనమే. అందరూ ట్రాఫిక్​ రూల్స్​ పాటించాలి. రోడ్డు భద్రత గురించి అందరికీ తెలియాలని అతను చేసిన ప్రయత్నాలే అతనికి స్టార్​ హోదా ఇచ్చాయి. సుబోధ్ లోంధే అసలు పేరు సుబోధ్ సునంద బాపు లోంధే. అతను మహారాష్ట్రలోని కళ్యాణ్‌‌లో 1996లో పుట్టాడు. అతనికి చిన్నప్పటినుంచి డాన్స్​  అంటే బాగా ఇష్టం. 

ఎందుకంటే.. 

సుబోధ్​ కళ్యాణ్‌‌ ఏరియాలో ఉంటాడు. 2021లో ఆ ఏరియాలో ట్రాఫిక్​ పెరగడంతో కొత్తగా సిగ్నల్స్​ని ఇన్‌‌స్టాల్ చేశారు. కానీ.. అక్కడివాళ్లు వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. రెడ్​ సిగ్నల్​ పడినా వెహికిల్స్​ని ఆపేవాళ్లే కాదు. దాంతో.. చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగేవి. అలాంటి సంఘటనలు చూసిన సుబోధ్​ ఆ ప్రమాదాలను ఎలాగైనా ఆపాలి అనుకున్నాడు. అందుకోసం ఏదైనా డిఫరెంట్​గా చేయాలి అని డిసైడ్​ అయ్యాడు. అతను అప్పటికే మంచి డ్యాన్సర్. కాబట్టి తనకు తెలసిన ఆర్ట్​తోనే ప్రజలకు అవగాహన కల్పించాలి అనుకున్నాడు. అప్పుడే అతనికి ఈ సిగ్నల్​ డ్యాన్సింగ్​ ఐడియా వచ్చింది. దాంతో అతను ట్రాఫిక్​ సిగ్నల్​ దగ్గర ఇరుక్కుపోయిన ప్రతిసారి బైక్​ దిగి, డాన్స్​ చేసేవాడు. అంతేకాకుండా ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగకుండా గ్రీన్​ సిగ్నల్​ పడకముందే డాన్స్​ కంప్లీట్​ చేసేవాడు. అలా చేసినందుకే ఎంతో మంది స్టార్స్​ ప్రశంసలు అందుకున్నాడు. 

హెల్మెట్ గయ్​

సిగ్నల్​ దగ్గర డాన్స్​ చేస్తుండడంతో ఆ ఏరియాలో బాగా ఫేమస్​ అయిపోయాడు సుబోధ్​. పోలీసులు కూడా అతను చేస్తున్న పనిని మెచ్చుకున్నారు. బాగా డాన్స్​ చేస్తాడనే పేరొచ్చింది. దాంతో సుబోధ్​ ఓ అడుగు ముందుకేసి అతను డాన్స్​ చేస్తున్నప్పుడు తన ఫ్రెండ్స్​తో వీడియో రికార్డ్ చేయించాడు. ఆ వీడియోలను యూట్యూబ్​లో అప్​లోడ్​  చేసేవాడు. అలా మొదటి వీడియోని 2021లో అప్​లోడ్​ చేశాడు. సింగిల్​ టేక్​లో అద్భుతంగా డాన్స్​ చేయడం, ట్రాఫిక్​ రూల్స్​ మీద అవగాహన కల్పించడంతో ఆ వీడియోలు బాగా వైరల్​ అయ్యాయి. కానీ. అప్పటికి అతని పేరు ఎవరికీ పెద్దగా తెలియకపోవడంతో అందరూ ‘‘హెల్మెట్ గయ్​”అని పిలిచేవాళ్లు. ఎందుకంటే.. అతను డాన్స్​ చేస్తున్నప్పుడు కూడా హెల్మెట్​ తీసేవాడు కాదు. 

కాస్త కష్టమే

సుబోధ్​ ఇదివరకు ఎక్కడా డాన్స్​ నేర్చుకోలేదు. కానీ.. చాలా బాగా డాన్స్​ చేస్తాడు. అయినా.. ట్రాఫిక్​ సిగ్నల్​ దగ్గర డాన్స్​ చేయడం కాస్త కష్టమనే అంటున్నాడు సుబోధ్​. ‘‘అంతమంది జనాల ముందు డాన్స్​ చేయాలి. పైగా అదే టైంలో కెమెరాకు ఫేవర్​గా ఉండాలి. సిగ్నల్​ పడేలోపు ప్లాన్​ చేసుకున్న స్టెప్స్​ కంప్లీట్​ చేయాలి. అందుకే ప్రతీది ముందే ప్లాన్​ చేస్తా. ఎక్కడ డాన్స్​ చేయాలి?  కెమెరా ఎక్కడ పెట్టాలి? అనేది ముందే చూసుకుంటా. ఎందుకంటే.. అనుకున్న టైంలోపు డాన్స్​ కంప్లీట్ చేయలేకపోతే అక్కడున్నవాళ్లకు చాలా ఇబ్బంది కలుగుతుంది” అంటున్నాడు సుబోధ్​.

ఛానెల్​

అతను ‘‘సుబోధ్​ లోధే” పేరుతో ఛానెల్​ నడుపుతున్నాడు. ఛానెల్​ని 2017లోనే మొదలుపెట్టినా రెగ్యులర్​గా వీడియోలు అప్​లోడ్​ చేసింది మాత్రం 2021 నుంచే. మరో విషయం ఏంటంటే.. సుబోధ్​ ఎక్కువగా షార్ట్​ వీడియోలు మాత్రమే అప్​లోడ్​ చేస్తున్నాడు. పది నిమిషాల కంటే ఎక్కువ డ్యురేషన్​ ఉన్న వీడియోలు పదికి మించి లేవు. అయినా.. ఛానెల్​ను 1.79 మిలియన్ల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. అంతేకాదు.. సుబోధ్​ ఆ షార్ట్​ వీడియోల్లోనే యాడ్​ ప్రమోషన్స్​ కూడా చేస్తున్నాడు.