తిరంగా ర్యాలీ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

తిరంగా ర్యాలీ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: బీజేపీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ట్యాంక్​బండ్​పై తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 వరకు ట్రాఫిక్​ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్​డేవిస్ శుక్రవారం తెలిపారు. సెక్రటేరియేట్ జంక్షన్‌‌‌‌ నుంచి అప్పర్​ట్యాంక్ బండ్‌‌‌‌ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి అప్పర్​ట్యాంక్​బండ్​కు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.

కర్బల మైదాన్ నుంచి అప్పర్​ట్యాంక్ బండ్‌‌‌‌ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ వైపు, డీబీఆర్ మిల్స్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలను కవాడిగూడ గోశాల వైపు డైవర్ట్​చేస్తారు. అంబేద్కర్ విగ్రహం, సెయిలింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, సెక్రటేరియట్ జంక్షన్, ఇక్బాల్ మినార్, వీవీ లిబర్టీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు ఆల్టర్నేట్ మార్గాలు చూసుకోవాలని సూచించారు.