హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ముఖ్యంగా నాంపల్లి వైపు వెళ్లే వాళ్లకు..

హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ముఖ్యంగా నాంపల్లి వైపు వెళ్లే వాళ్లకు..

హైదరాబాద్: మృగశిర కార్తెలో చేప ప్రసాదం పంపిణీకి రంగం సిద్ధమైంది. జూన్ 8, 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో.. పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8 ఉదయం 6 గంటల నుంచి జూన్ 9 రాత్రి 8 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ ఉండటంతో.. ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు ప్రకటిస్తూ ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్ ప్రాంతాల్లో పార్క్ చేయాలని, ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే బస్సులు, వ్యాన్లలోని ప్రయాణికులకు గాంధీ భవన్ బస్ స్టాప్ వద్దకు అనుమతి.. నాంపల్లి వైపు నుంచి వచ్చే వారు గృహకల్ప బస్ స్టాప్ వద్దకు అనుమతించనున్నట్లు తెలిపారు. 

వీఐపీ కార్ పాస్ హోల్డర్ల కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ద్విచక్ర వాహనదారుల కోసం మనోరంజన్ కాంప్లెక్స్, భీమ్‌రావ్ బాడా ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాల ఏర్పాటు చేశారు. ఆటోలలో వచ్చే భక్తులు షెజాన్ హోటల్ ఎదురుగా ఏర్పాటు చేశారు.  

ట్రాఫిక్ మళ్లింపులు ఇవే..
* ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే వాహనాలను అబిడ్స్, జీపీఓ, నాంపల్లి వైపుకు మళ్లిస్తారు.
* ఎంజే బ్రిడ్జ్, బేగంబజార్ ఛత్రి వైపు నుంచి నాంపల్లి వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను అలాస్కా జంక్షన్ వద్ద దారుస్సలాం, ఏక్ మినార్ ప్రాంతాల వైపునకు మళ్లిస్తారు
* ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, భారీ వాహనాలపై ప్రత్యేక ఆంక్షలు
* ఎంజే మార్కెట్–తాజ్ ఐలాండ్ మార్గంలో వీటికి అనుమతి ఉండదు
* హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి