రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..

రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..

హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం (ఏప్రిల్ 23) నాడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ సీపీ కొకొత్త కోట శ్రీనివాస్రెడ్డి చెప్పారు.హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామ మందిరం నుంచి తాడ్ బండ్ హానుమాన్ మందిర్ వరకు విజయ యాత్ర నిర్వహింనున్నందున ఆ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. 

గౌలిగూడ రామమందిరం నుంచి హనుమాన్ జయంతి విజయాత్ర ప్రారంభమై శంకర్ షేర్ హోటర్, బడేమియా పెట్రోల్ పంపు, గౌలిగూడ చమాన్, రంగ్ మహల్ జంక్షన్, జీపీవో, యూసుఫ్ కంపెనీ, డీఎం హెచ్ ఎస్, చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్, కాచిగూడ ఎక్స్ రోడ్, బొగ్గుల కుంట ఎక్స్ రోడ్, ఈడెన్ గార్డెన్, లింగంపల్లి ఎక్స్ రోడ్, వైఎంసీఎ- నారాయణగూడ, షాలిమర్, వాటర్ ట్యాంక్ నారాయణగూడ, బర్కత్ పుర పోస్టాఫీసు, నారాయణగూడు ఫ్లైఓవర్, క్రౌన్ ఓవర్ ఫ్లైఓవర్, మెట్రో కేఫ్, వీఎస్టీ ఎక్స్ రోడ్, ఇందిరాపార్క్ మీదుగా సాగుతుంది. 

అశోక్ నగర్ టీ జంక్షన్, స్ట్రీట్ నం. 9 హయత్ నగర్, కవాడిగూడ, డిబిఆర్ కాలేజీ,బైబిల్ హౌజ, సైలింగ్ క్లబ్, కర్బాలా మైదాన్ కవాడిగూడ,ప్యాట్నీ, రాణ్ గంజ్, సీటీవో, సీటీవో ఫ్లైఓవర్ , బాలంరాయ్, సీటీవో ఫ్లైఓవర్ , సేఫ్ ఎక్స్ ప్రెస్, బోయిన్ పల్లి ఎక్స్ రోడ్, టివోలీ, డైమండ్ పాయింట్, బోయిన్ పల్లి మార్కెట్, మస్తాన్ హోటణ మీదుగా తాడ్ బండ్ ఆంజేనేయ స్వామి ఆలయానికి చేరుకుంటుంది. 

శ్రీహనుమాన్ విజయ యాత్ర సందర్భంగా  ఈ ప్రాంతాల నుంచి వెళుతున్న సమయంలో ఆయా ప్రదేశాలలో అవాంఛనీయ సంఘటనలు, అంతరాయాలు కలగకుండా ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించడానికి సిద్ధంగా కావాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.