మేడారం రూట్​లో ట్రాఫిక్​ జామ్​

మేడారం రూట్​లో ట్రాఫిక్​ జామ్​
  •     ఎన్​హెచ్​పై దిగబడ్డ ఇసుక లారీ..
  •       నాలుగు కిలోమీటర్ల ట్రాఫిక్​ 

ములుగు, వెలుగు: ములుగు - – జాకారం మధ్యలో మేడారం జాతర కోసం జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతుండగా ఓ ఇసుక లారీ కల్వర్టు సమీపంలో ఆదివారం దిగబడింది. దీంతో మేడారం వెళ్లి తిరిగి వచ్చే భక్తుల వెహికల్స్​ నిలిచిపోయాయి. సుమారు మూడు గంటల పాటు ట్రాఫిక్​ కు అంతరాయం ఏర్పడింది. హనుమకొండ వెళ్లే వాహనాలను ములుగు, జంగాలపల్లి గ్రామాల వద్ద నిలిపివేసి పరకాల మీదుగా డైవర్ట్ చేశారు.

మధ్యాహ్నం 3గంటల నుంచి ములుగు వైపు వచ్చే వాహనాలు సైతం నిలిచిపోవడంతో సుమారు నాలుగుకిలోమీటర్ల మేర జాం అయింది. మూడు గంటల తర్వాత లారీని తీశారు. సాయంత్రం 6.30గంటలకు పరిస్థితి నార్మల్​ అయింది. జాతర సమీపిస్తుండగా ఇసుక లారీలను నియంత్రించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు స్థానికులు కోరుతున్నారు.