డ్రోన్లతో ట్రాఫిక్ మానిటరింగ్‌‌

డ్రోన్లతో ట్రాఫిక్ మానిటరింగ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు : ట్రాఫిక్ మానిటరింగ్ కోసం సైబరాబాద్ పోలీసులు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. ‘థర్డ్‌‌ ఐ ట్రాఫిక్‌‌ మానిటరింగ్‌‌’ పేరుతో కమిషనరేట్​పరిధిలో డ్రోన్లు ఆపరేట్​చేస్తూ రద్దీ ప్రాంతాల్లోని ట్రాఫిక్ ను మానిటర్​చేస్తున్నారు.

సైబరాబాద్ సిటీ ట్రాఫిక్‌‌ పోలీసులు, సొసైటీ ఫర్‌‌‌‌ సైబర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం​కొనసాగుతోంది. డ్రోన్‌‌ సిస్టమ్‌‌ను సీపీ అవినాష్ మహంతి శుక్రవారం పరిశీలించారు. ఈ విధానంతో రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్​పెట్టొచ్చని పోలీసులు చెబుతున్నారు.