
హైదరాబాద్,వెలుగు: ట్రాఫిక్ పెండింగ్ చలాన్లకు వాహనదారుల నుంచి భారీగా స్పందన వస్తుంది. డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన రెండు రోజుల్లోనే రూ.10కోట్లు వసూలు అయ్యాయి. గురువారం రాత్రి 10.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.80 లక్షలకు పైగా చలాన్లు క్లియర్ అయ్యాయి.
అధికంగా హైదరాబాద్ కమిషనరేట్ లో 3.84 లక్షల చలాన్లకు రూ.2.90 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 2.2 లక్షల చలాన్లకు రూ.1.90 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 97 వేల చలాన్లకు రూ.81 లక్షలు వాహనదారుల నుంచి వసూలు చేశారు. చలాన్ సైట్ పై పెద్ద ఎత్తున తాకిడి పెరగడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి.