చలాన్లు పెండింగ్.. ఆర్టీసీ బస్సు సీజ్

చలాన్లు పెండింగ్.. ఆర్టీసీ బస్సు సీజ్

ఎల్బీనగర్, వెలుగు: ట్రాఫిక్ చలాన్లు పెండింగ్​ ఉన్న హయత్‌నగర్ డిపో-2కు చెందిన ఆర్టీసీ అద్దె బస్సును పోలీసులు సీజ్ చేశారు. సోమవారం రాత్రి ఎల్బీనగర్ చౌరస్తాలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బస్సు ఓవర్ స్పీడ్‌తో రాంగ్ రూట్‌లో రావడంతో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆపి తనిఖీ చేశారు. 

బస్సుపై మొత్తం 14 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉండగా, రూ.12,890 జరిమానా పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో ప్రయాణికులను మరో బస్సులో పంపించి, డిపో మేనేజర్‌, బస్సు యజమానికి సమాచారం ఇచ్చి బస్సును సీజ్ చేశారు.