
రైల్వే ఓవర్ బ్రిడ్జిను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
గచ్చిబౌలి, వెలుగు: కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)ను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.86 కోట్లతో చేపట్టిన ఈ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే హైటెక్ సిటీ -– కూకట్ పల్లి వరకు, జేఎన్టీయూ –- హైటెక్ సిటీ వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి. సనత్ నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కి.మీ ప్రయాణ దూరం తగ్గుతుందని అధికారులు తెలిపారు. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కారణంగా ఇయ్యాల ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.