ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ- ట్రాఫిక్ ఆంక్షలు

ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ- ట్రాఫిక్ ఆంక్షలు

GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు(శనివారం) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది.దీనికి సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌ సభకు హాజరు కానుండటంతో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  స్టేడియం పరిసరాల్లో వాహనాలకు అనుమతి ఉండదు. ఆయా ప్రాంతాలలో తిరిగే వాహనాలను మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలించనున్నారు.

సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం పోలీసులు స్థలాలను సూచించారు పోలీసులు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వారు స్టేడియం గేట్-జి దగ్గర దిగాలని సూచించారు. పబ్లిక్ గార్డెన్స్, రవీంద్రభారతి ఐమాక్స్ వచ్చి పార్కింగ్ చేయాలన్నారు. ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, పాతబస్తీ నుంచి వచ్చేవారు ఏఆర్ పెట్రోల్ పంప్ దగ్గర దిగాలని సూచించారు. పబ్లిక్ గార్డెన్స్, పీపుల్స్ ప్లాజా దగ్గర పార్కింగ్ చేయాలని సూచించారు ముషీరాబాద్, అంబర్ పేట, హిమాయత్ నగర్ నుంచి వచ్చే వారు స్టేడియం గేట్ ఎఫ్, గేట్ ఎఫ్-1 దగ్గర దిగి నిజాం కాలేజీ దగ్గర  పార్కింగ్ చేయాలని సూచించారు. మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు గేట్-జి దగ్గర దిగాలని వాహనాలను నిజాం కాలేజీ దగ్గర పార్కింగ్ చేయాలన్నారు.

అంతేకాదు కంట్రోల్ రూమ్ వైపు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించనున్నారు పోలీసులు. అబిడ్స్, గన్ ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలను ఎస్బీఐ, చాపెల్ రోడ్డువైపు మళ్లిస్తారు. బషీర్బాగ్ అబిడ్స్ నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కోఠివైపు వెళ్లాలి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్ బాగ్ వచ్చే వాహనాలు హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి బషీర్ బాగ్ వైపు వచ్చే వాహనాలు హిమాయత్ నగర్ మీదుగా వెళ్తాయి.