ఇండియన్ రేసింగ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా మూడ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

ఇండియన్ రేసింగ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా మూడ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ రేసింగ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా పోలీసులు మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఆదివారం రేసింగ్‌‌‌‌‌‌‌‌ ముగిసే వరకు నెక్లెస్‌‌‌‌‌‌‌‌ రోడ్, ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌మార్గ్‌‌‌‌‌‌‌‌, ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌ ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్లను మూసివేయనున్నారు. రేసింగ్ జరిగే హుస్సేన్‌‌‌‌‌‌‌‌ సాగర్ ఏరియాలో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ డైవర్షన్లు చేస్తున్నారు. ఇయ్యాల, రేపు రాత్రి ట్రాఫిక్​ డైవర్షన్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని ట్రాఫిక్​ పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్లేవారు ఇతర రూట్లలో వెళ్లాలని సూచించారు. మూడ్రోజులపాటు ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాట్‌‌‌‌‌‌‌‌, నెక్లెస్‌‌‌‌‌‌‌‌ రోడ్, లుంబినీ పార్క్‌‌‌‌‌‌‌‌ మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

రోడ్స్ క్లోజ్, ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండే ప్రాంతాలు

  • ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌ జంక్షన్​నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, ఐమాక్స్ వైపు నో ఎంట్రీ. వీవీ విగ్రహం నుంచి షాదన్ కాలేజ్‌‌‌‌‌‌‌‌, రవీంద్రభారతి వైపు ట్రాఫిక్​ను ​డైవర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తారు.
  • ఖైరతాబాద్ బడా గణేశ్​ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్, నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్​ను అనుమతించరు. బడా గణేశ్​వద్ద రాజ్‌‌‌‌‌‌‌‌దూత్ లేన్ వైపు మళ్లిస్తారు.
  • బుద్ధభవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు నో ఎంట్రీ. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్/ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్ వైపు మళ్లిస్తారు.
  • రసూల్‌‌‌‌‌‌‌‌ పురా, మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను అనుమతించరు. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
  • ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగు తల్లి జంక్షన్, ట్యాంక్‌‌‌‌‌‌‌‌ బండ్ వైపు నో ఎంట్రీ. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌, కట్ట మైసమ్మ టెంపుల్‌‌‌‌‌‌‌‌, లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంక్​బండ్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, పబ్లిక్‌‌‌‌‌‌‌‌ గార్డెన్స్, బషీర్​ బాగ్, లిబర్టీ నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే భవన్‌‌‌‌‌‌‌‌, ట్యాంక్ బండ్ వైపు డైవర్ట్ చేస్తారు.
  • ట్యాంక్‌‌‌‌‌‌‌‌ బండ్, తెలుగు తల్లి నుంచి నెక్లెస్ రోటరీ వైపు నో ఎంట్రీ. తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి జంక్షన్ వైపు డైవర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తారు.
  • బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు రోడ్‌‌‌‌‌‌‌‌ క్లోజ్‌‌‌‌‌‌‌‌. తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.
  • ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు క్లోజ్. ఇక్బాల్ మినార్ జంక్షన్ వద్ద రవీంద్రభారతి జంక్షన్ వైపు ట్రాఫిక్ ​డైవర్ట్ చేస్తారు.

ఆర్టీసీ బస్సుల మళ్లింపు

అఫ్జల్‌‌‌‌‌‌‌‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు ట్యాంక్ బండ్ మీదుగా నో ఎంట్రీ. తెలుగు తల్లి ఫ్లైఓవర్, కట్ట మైసమ్మ, లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్స్, కవాడిగూడ మీదుగా వెళ్లాలి. లేదా ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, పబ్లిక్ గార్డెన్స్ జంక్షన్, -బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్ లిబర్టీ మీదుగా వెళ్లి లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్లాలి.