అక్టోబర్ 23 నుంచి ట్యాంక్​బండ్ ఏరియాలో 26 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

అక్టోబర్ 23 నుంచి ట్యాంక్​బండ్ ఏరియాలో 26 వరకు  ట్రాఫిక్ ఆంక్షలు
  • దుర్గామాత విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు 
  • ఈ నెల 26వ తేదీ వరకు అమలు
  • ఎన్టీఆర్ మార్గ్ వైపు నో ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు : దుర్గామాత విగ్రహాల నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు ట్యాంక్​బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ మార్గ్, గార్డెన్ పాయింట్, జల విహార్, సంజీవయ్య పార్క్ వద్ద ఉన్న బేబీ పాండ్స్ రూట్లలో సోమవారం నుంచి గురువారం వరకు వెహికల్స్ ను దారి మళ్లించనున్నారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు ఆదివారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దుర్గామాత మండపాల నిర్వాహకులు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాల్లో ట్రావెల్ చేయాలన్నారు. అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి ఎన్టీఆర్ మార్గ్​ వైపు ట్రాఫిక్​కు పర్మిషన్ లేదన్నారు. ఎమర్జెన్సీ అయితే ట్రాఫిక్ హెల్ప్ లైన్ నం. 9010203626కు కాల్ చేయాలని సూచించారు.

ట్రాఫిక్ డైవర్షన్ ఇలా..

  •  పంజాగుట్ట, రాజ్​భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వెహికల్స్ ను వీవీ విగ్రహం వద్ద షాదన్ కాలేజీ, నిరంకారి భవన్​ వైపు దారి  మళ్లించనున్నారు.
  •  నిరంకారి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వచ్చే ట్రాఫిక్​ను సైఫాబాద్ ఓల్డ్ పోలీస్ స్టేషన్, రవీంద్రభారతి మీదుగా పంపిస్తారు. 
  •  కంట్రోల్ రూమ్, సైఫాబాద్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ రూట్​లో ఇక్బాల్ మినార్ వైపు వచ్చే ట్రాఫిక్​ను రవీంద్రభారతి, లక్డీకపూల్ వైపు దారి మళ్లించనున్నారు.
  •  ఇక్బాల్ మినార్ నుంచి ట్యాంక్​బండ్ మీదుగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు వచ్చే వెహికల్స్​ను కట్టమైసమ్మ  మీదుగా పంపిస్తారు. 
  •  మినిస్టర్ రోడ్, రాణిగంజ్ నుంచి పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్ వైపు వచ్చే వెహికల్స్ ను నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి మీదుగా దారి మళ్లిస్తారు.
  •   బుద్ధభవన్ నుంచి నల్లగుట్ట బ్రిడ్జి, పీవీ మార్గ్ వైపు ట్రాఫిక్​కు అనుమతి లేదు. సోనాబి అబ్దుల్లా మసీదు వద్ద ట్రాఫిక్​ను డైవర్ట్ చేస్తారు. 
  •  నాంపల్లి,ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి బీజేఆర్ సర్కిల్ వైపు ట్రాఫిక్​ను అనుమతించరు. రవీంద్రభారతి వైపు దారి మళ్లిస్తారు.