ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారా..? చలాన్ కట్టేందుకు ఆఫర్

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారా..? చలాన్ కట్టేందుకు ఆఫర్
  • మరో ఆఫర్​ ఇచ్చేందుకు ట్రాఫిక్​ పోలీసుల యోచన

హైదరాబాద్​, వెలుగు: వాహనదారులకు ట్రాఫిక్​ పోలీసులు మరో బంపరాఫర్​ ఇవ్వనున్నారు. రూల్స్​ పాటిస్తూ పొరపాటున వాటిని బ్రేక్​ చేసిన వాళ్లు చలాన్స్​ను గడువులోపు కడితే 20 శాతం డిస్కౌంట్​ ఇచ్చేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ట్విట్టర్​‌‌, ఫేస్​బుక్, వాట్సాప్​ల ద్వారా ప్రజల నుంచి వస్తున్న సలహాలను పరిశీలిస్తున్న ట్రాఫిక్​ పోలీసులు.. చలాన్లను విధించిన దగ్గర్నుంచి 15 లేదా 30 రోజుల్లోగా ఫైన్ చెల్లిస్తే ఈ ఆఫర్​ వర్తింపజేసేందుకు గైడ్​లైన్స్​ రూపొందిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఈ–చలాన్​ వెబ్​సైట్​ను అప్​డేట్​ చేయనున్నారు.  
రెండు కేటగిరీలుగా..
ఇటీవల పెండింగ్​ చలాన్ల క్లియరెన్స్​ కోసం ట్రాఫిక్​ పోలీసులు ఆఫర్​ను ప్రకటించిన సంగతి తెలిసిందే. గడువు పూర్తయ్యాక కూడా వాహనదారుల నుంచి రిక్వెస్టులు పెరుగుతున్నాయి. ట్రాఫిక్​ రూల్స్​ను తప్పనిసరిగా పాటిస్తూ పొరపాటున బ్రేక్​ చేసే కేసుల్లో చలాన్లలో ఆఫర్​ ఇవ్వాలని కోరుతున్నారు. వారి సలహాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. రూల్స్​ పాటించే వారిని, పాటించని వారిని గుర్తించి కేటగిరీలుగా విభజించనున్నారు. పెండింగ్​ చలాన్ల క్లియరెన్స్​ ఆధారంగా పదేపదే తప్పు చేస్తున్న వాళ్లెవరో గుర్గించనున్నారు. మార్చిలో అమల్లోకి తెచ్చిన డిస్కౌంట్​ ఆఫర్​ లో భాగంగా 83 శాతం మేర చలాన్లు క్లియర్​ అయ్యాయి. ఆఫర్​తో వాహనదారులకూ ఊరటలభించింది. మళ్లీ వాళ్ల వాహనాలపై చలాన్లు జనరేట్​ కాకుండా 
జాగ్రత్త పడుతున్నారు.
 

 

ఇవి కూడా చదవండి

పోలీసు ఉద్యోగాలకు 8.30 లక్షల మంది దరఖాస్తు

వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తం

కరోనా టైంలో ప్రపంచానికి మన సత్తా తెలిసింది

దేశ రాజకీయాల్లో మార్పు తప్పదు