లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ట్రాఫిక్ ఎస్సై

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ట్రాఫిక్ ఎస్సై

లంచం తీసుకంటూ ట్రాఫిక్ ఎస్సై అడ్డంగా దొరికాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకుల దగ్గరి నుంచి లంచం తీసుకుంటుండగా కెమెరాకు బుక్కయ్యాడు. విషయం పై ఆఫీసర్లకు తెలిసి సస్పెన్షన్ దాక వెళ్లింది. వివరాల్లోకి వెళితే హనుమకొండ ట్రాఫిక్ ఎస్సైగా పని చేస్తున్న డేవిడ్ హనుమకొండలోని ములుగు రోడ్ వద్దకు చెకింగ్ కు వెళ్లాడు. బండి పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి లైసెన్స్ అడిగాడు. ఆ ఇద్దరు లేదని చెప్పడంతో లంచం డిమాండ్ చేశాడు.

 లంచం తీసుకుంటుండగా బిల్డింగ్ పై నుంచి ఓ వ్యక్తి ఈ మొత్తం సన్నివేశాన్ని వీడియో తీశారు. ఇంకే ముంది క్షణాల్లోనే వీడియో వైరల్ గా మారింది. ఆ నోట ఈ నోట విషయం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా దాక వెళ్లింది. వెంటనే కమిషనర్ ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు సహకరించిన తోటి సిబ్బంది పై కూడా విచారణ చేపట్టారు.