తంగళ్లపల్లి, -శనిగరం మధ్య రాకపోకలు బంద్

తంగళ్లపల్లి, -శనిగరం మధ్య  రాకపోకలు బంద్

కోహెడ, వెలుగు: కోహెడ మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి శనిగరం ప్రాజెక్టు మత్తడి ప్రవాహం పెరిగింది. వరద నీరు పిల్లి వాగుపై ఉన్న లో లెవల్​ వంతెన పైనుంచి వెళ్లడంతో అధికారులు తంగళ్లపల్లి, -శనిగరం గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. మండలంలోని కూరెల్ల గ్రామంలో గౌరవేణి బాలయ్యకు చెందిన పాడి ఆవు పిడుగు పడి మృతి చెందింది.  పది రోజుల కింద ఆవును రూ.70 వేలు పెట్టి కొనుగోలు చేశానని రైతు బోరున విలపించాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.