వైరల్ వీడియో: పాము రోడ్డు దాటడం కోసం ట్రాఫిక్ ఆపేశారు

వైరల్ వీడియో: పాము రోడ్డు దాటడం కోసం ట్రాఫిక్ ఆపేశారు

ఉడిపి: అవును.. మీరు చదివింది నిజమే. పాము ఏంటి.. రోడ్డు దాటడం కోసం ట్రాఫిక్ ఆపడమేంటి అనుకుంటున్నారా.. ఇంకా అనుమానం డౌటెందుకు వెంటనే కింద వీడియో లింక్ క్లిక్ చేయొచ్చు. వివరాలు ఏమిటంటే.. కర్నాటకలోని ఉడిపి పట్టణం కాల్సంకా సెంటర్ వద్ద హఠాత్తుగా ఓ పెద్ద పాము రోడ్డుపైకి వచ్చిం. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న కానిస్టేబుల్ వెంటనే గుర్తించి కొద్దిసేపు ట్రాఫిక్ ఆపేశారు. దాదాపు 15 అడుగుల పొడవు కనిపిస్తున్న ఈ పెద్ద పాము.. ఎలా వచ్చిందో కాని రోడ్డుపైకి వచ్చి మెల్లగా మెలికలు తిరుగుతూ రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుకు అడ్డంగా ఒక వైపు నుండి మరో వైపుకు వెళుతుండడం గుర్తించి కానిస్టేబుల్ ట్రాఫిక్ ఆపేయగా.. పెద్ద సెంటర్ కావడంతో కార్లు.. బైకులు.. పాదచారులు ఎక్కడికక్కడ నిలబడిపోయారు. మెలికలు తిరుగుతూ మెల్లగా ముందుకు పాకుతూ వెళుతున్న పామును జనాలు ఆసక్తిగా చూశారు. ఈ పాము స్వేచ్ఛగా రోడ్డు దాటడం కోసం దాదాపు 30 నిమిషాలు ట్రాఫిక్ నిలిచిపోయిందట. గతంలో  ఉడిపి పరిసర ప్రాంతాలన్నీ పచ్చదనంతో కళకళలాడేవి. అడవి జంతువులు, వన్యప్రాణుల సంఖ్య భారీగా ఉండేది. అయితే అటవీ సంపద క్రమంగా కనుమరుగైపోతుండడంతో వన్యప్రాణులు కూడా తరచూ రోడ్డువైపు వస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఈ పాము కూడా రోడ్డు దాటడాన్ని స్థానికులు వీడియో తీసి షేర్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇంకేముంది వెంటనే స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. వాటి ఆవాసాలను మనం నాశనం చేస్తుంటే.. అవి రోడ్డునపడి ప్రాణాలు కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాస్ లు వేసినట్లే.. పాములు దాటేందుకు కోబ్రా క్రాస్ లు వేయండి అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్నారు. ఏతా వాతా అందరూ అటవీ సంపద, ప్రకృతి నాశనంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వీడియోను వైరల్ చేస్తున్నారు. అదే ఈ కింద వీడియో. లింక్ క్లిక్ చేసి మీరు కూడా చూసేయండి మరి.