గచ్చిబౌలిలోని గేటెడ్ కమ్యూనిటీలో విషాదం.. తెల్లవారుజామున 4 గంటలకు భారీ శబ్దం.. ఏంటా అని చూస్తే..

గచ్చిబౌలిలోని గేటెడ్ కమ్యూనిటీలో విషాదం.. తెల్లవారుజామున 4 గంటలకు భారీ శబ్దం.. ఏంటా అని చూస్తే..

గచ్చిబౌలి, వెలుగు: డిప్రెషన్ లో ఉన్న ఓ యువకుడు తాను నివాసం ఉండే అపార్ట్​మెంట్11వ ఫ్లోర్ నుంచి కిందకు దూకి మృతి చెందాడు. కర్నాటకకు చెందిన గౌతమ్ శెట్టి(29) తన తల్లిదండ్రులతో కలిసి గచ్చిబౌలిలోని మై హోమ్ విహంగ గేటెడ్ కమ్యూనిటీలోని 6వ ఫ్లోర్లో నివాసం ఉంటున్నాడు. తన తండ్రికి చెందిన వ్యాపారాలను చూసుకుంటున్నాడు. గత ఆరు ఏడు నెలల నుంచి అనారోగ్య సమస్యల కారణంగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు.

సోమవారం తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. అనంతరం మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా, గౌతమ్ శెట్టి అపార్ట్​మెంట్ 11వ ఫ్లోర్ కి చేరుకొని కిందకు దూకాడు. భారీ శబ్దం రావడంతో సెక్యూరిటీ సిబ్బంది, అపార్ట్​మెంట్ వాసులు బయటికి వచ్చి చూడగా, గౌతమ్ శెట్టి రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.