మంచిర్యాల జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య విషాదాన్ని నింపింది. మందమర్రి మండలం ఎర్రగుంటపల్లె కు చెందిన కానిస్టేబుల్ అరవింద్ యాదవ్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2026 మే 17 రాత్రి రామన్ కాలనీ ఫ్లైఓవర్ వద్ద రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విధులకు సక్రమంగానే హాజరవుతూ ఉండే కానిస్టేబుల్ మృతి అటు పోలీస్ శాఖలో ఆందోళనకు గురిచేసింది. సంపాదించే వ్యక్తి చనిపోవడంతో తమ పరిస్థితి ఏంటనే ఆందోళనలో ఉన్నారు కుటుంబ సభ్యులు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
