
- జవహర్ నగర్ పరిధిలోని పాపయ్యనగర్లో విషాదం
జవహర్ నగర్, వెలుగు: జవహర్ నగర్ పరిధిలోని పాపయ్యనగర్లో విషాదం నెలకొంది. భారీ వర్షం కారణంగా ఇంట్లోకి వరద నీరు చేరడంతో భయాందోళనకు గురై ఓ ఇల్లాలు గుండె ఆగింది. బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి జవహర్నగర్ పరిధిలోని పాపయ్యనగర్నీట మునిగింది.
తమ ఇంట్లోకి ఒక్కసారిగా వరద నీరు రావడంతో రాధాభాయి (56) అనే మహిళ భయాందోళనకు గురై కుప్పకూలింది. అదే వరద ప్రవాహంలో బాధితురాలిని కుటుంబసభ్యులు స్థానికుల సహాయంలో ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ రాధాబాయి కన్నుమూసింది. బాధిత కుటుంబాన్ని మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ పరామర్శించారు. కాగా, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని జవహర్ నగర్ పోలీసులు తెలిపారు.