కొమురంభీం వర్ధంతి రోజు విషాదం.. విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి

కొమురంభీం వర్ధంతి రోజు విషాదం.. విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి

నిర్మల్ జిల్లా కడెం మండలం చిన్న జిల్లాల్ గోండు గూడెంలో విషాదం జరిగింది. కొమురం భీం వర్దంతి సందర్భంగా జెండా ఎగురవేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. జెండా ఇనుప పైపు విద్యుత్ తీగలకు తగలడంతో... ఇద్దరు యువకులు చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.  మృతులు మోహన్, భీం రావు గా గుర్తించారు. గాయపడిన వెడ్మ వెంకట్రావును  ఆస్పత్రికి తరలించారు. 

 ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.