
- పెళ్లి కావట్లేదని మనస్తాపంతో ఐటీ ఎంప్లాయ్ సూసైడ్
ముషీరాబాద్,వెలుగు : మనస్తాపంతో ఐటీ ఎంప్లాయ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జగిత్యాల జిల్లా మహాలక్ష్మినగర్ కు చెందిన దోనకంటి సాయిరాం (32) హిమాయత్ నగర్ లోని వెలమ హాస్టల్ లో ఉంటూ మాదాపూర్ లో ఐటీ ఎంప్లాయ్ గా జాబ్ చేస్తున్నాడు. అనారోగ్యం, లావు కారణాలతో పెళ్లి సంబంధాలు రావట్లేదని డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపంతో శనివారం సాయిరాం ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా హాస్టల్ సిబ్బంది వెంటనే హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం సాయిరాం చనిపోయాడు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తండ్రి దోనకంటి లింగారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని దోమలగూడ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.