సికింద్రాబాద్​ లో విషాదం.. కూతుళ్లకు స్లీపింగ్​ ట్యాబ్లెట్స్ ఇచ్చి.. ఆత్మహత్య చేసుకున్న తండ్రి

సికింద్రాబాద్​ లో విషాదం..  కూతుళ్లకు స్లీపింగ్​ ట్యాబ్లెట్స్ ఇచ్చి.. ఆత్మహత్య చేసుకున్న తండ్రి

హైదరాబాద్​ : సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఓల్డ్ బోయిన్ పల్లి భవానినగర్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య కు పాల్పడ్డారు. తన ఇద్దరు కూతుర్లకు నిద్ర మాత్రలు ఇచ్చి, ఆ తర్వాత తాను కూడా నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

చనిపోయిన వారిలో తండ్రి శ్రీకాంత్ చారి (42), కూతుళ్లు స్రవంతి (8), శ్రావ్య (7) ఉన్నారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు డెడ్ బాడీలను సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు. 

ఈ  ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వీరి ఆత్మహత్యలకు అసలు కారణాలు ఏంటన్నదానిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సికింద్రాబాద్ లోని ఓ వెండి షాపులో శ్రీకాంత్ పని చేస్తున్నాడని చెబుతున్నారు పోలీసులు. జువెలరీ షాపులో ఉపయోగించే సైనెడ్ ను ఇంటికి తీసుకొని వచ్చిన శ్రీకాంత్.. అక్టోబర్ 12న రాత్రి భోజనం చేశారు. నిద్రపోవడానికి పై ‌ఫ్లోర్‌లో ఉన్న బెడ్ రూమ్ కు శ్రీకాంత్​ దంపతులతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్లారు. అర్థరాత్రి సమయంలో ఇద్దరు పిల్లలకు సైనెడ్ ఇచ్చి... ఆ తర్వాత తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్.