తన భూమిని లాక్కుంటున్నారని యువకుడి అఘాయిత్యం

 తన భూమిని లాక్కుంటున్నారని యువకుడి అఘాయిత్యం

సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం బోర్పట్లలో విషాదం చోటుచేసుకుంది. తన భూమిని లాక్కుంటున్నారని మనస్థాపంతో నందిశ్వర్ అనే యువకుడు ఆత్యహత్య చేసుకున్నాడు. తమ భూమిని పీఏసీఎస్ (PACS) చైర్మన్ దుర్గారెడ్డి డబుల్ బెడ్రూం పేరుతో లాక్కుంటున్నారని... మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకోని చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదే ఇష్యూపై గతంలో నందీశ్వర్ తండ్రి మల్లేష్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో  పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యయత్నం చేశారు. అప్పట్లో అధికారులు కొంత వెనక్కి తగ్గినా.. మళ్లీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారనే ఆవేదనతో నందీశ్వర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు జీవనాధారమైన భూమిని కోల్పోతుంటే ఆవేదనతో నందీశ్వర్ ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. డెడ్ బాడీతో సంగారెడ్డి దౌల్తాబాద్ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దుర్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.