అయ్యో.. అయేషా..ఎల్కేజీ చిన్నారిని చిదిమేసిన లారీ

అయ్యో.. అయేషా..ఎల్కేజీ చిన్నారిని చిదిమేసిన లారీ

​​​​​​కొడంగల్, వెలుగు: లారీ చక్రాల కిందపడి ఆరేండ్ల చిన్నారి మృతి చెందింది. వికారాబాద్ జిల్లా కొడంగల్​ పట్టణానికి చెందిన చాంద్ పాషా, రెహానా దంపతులకు సంతానం లేకపోవడంతో అయేషా (6) అనే చిన్నారిని దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఎల్​కేజీ చదువుతున్న చిన్నారిని రోజుమాదిరిగానే తల్లి రెహానా స్కూల్​కు తీసుకెళ్తుండగా, ఎన్​హెచ్ 163పై లారీ రూపంలో మృత్యువు కబళించింది. 

రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన లారీ చిన్నారి అయేషాపైకి దూసుకెళ్లడంతో, ఆ పసిప్రాణం తల్లి కళ్లముందే లారీ చక్రాల కింద నలిగిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న బిడ్డను చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. సమాచారం అందుకున్న ఎస్సై సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.