ఉద్యోగంలో వేధింపులు : నాలుగేళ్ల కూతురికి ఉరి వేసి.. కుటుంబం ఆత్మహత్య

ఉద్యోగంలో వేధింపులు : నాలుగేళ్ల కూతురికి ఉరి వేసి.. కుటుంబం ఆత్మహత్య

హైదరాబాద్ సిటీలో దారుణం.. నాలుగేళ్ల తన కూతురికి ఉరి వేసి.. ఆ తర్వాత ఆ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం మొత్తం చనిపోవటం షాక్ కు గురి చేసింది. కర్నూలుకు చెందిన కొప్పుల సాయికృష్ణ, భార్య చిత్రలేఖ, నాలుగేళ్ల కూతురు తేజస్వినీతో కలిసి సిటీలోని ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. 

చిత్రలేఖ హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ సెంటర్ ఉద్యోగం చేస్తుండేది. అక్కడే పని చేస్తున్న శ్యామ్ కొఠారి, గీతారావులు ఆమెను వేధింపులకు గురి చేశారు.. చిత్రలేఖపై తప్పుడు ఆరోపణలు చేసి ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. ప్లే స్లిప్ ఇవ్వలేదు.. ఆఫర్ లెటర్ సైతం ఇవ్వకుండా వేధించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన చిత్రలేఖ డిప్రెషన్ లోకి వెళ్లింది. బిర్లా సైన్స్ సెంటర్ లో జరుగుతున్న తప్పులు, పై ఉద్యోగుల బాగోతాన్ని చాలా సార్లు మంత్రి కేటీఆర్ కు ట్విట్ చేసినా.. పట్టించుకోలేదంటూ.. మొత్తం విషయాలను సూసైడ్ నోట్ గా రాశారు చిత్రలేఖ.

ఉద్యోగంలో వేధింపుల కారణంగా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రావటంతో ఇది సంచలనంగా మారింది. నాలుగేళ్ల కుమార్తె తేజస్వినికి ఉరి వేసిన తర్వాత.. భర్త సాయికృష్ణ, భార్య చిత్రలేఖ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు పోలీసులు. సూసైడ్ లేఖ ఆధారంగా విచారణ చేస్తున్నామని వెల్లడించారు పోలీసులు.