ఖమ్మంలోని పుట్టకోటలో దారుణం.. విడిపోయిన భార్యాభర్తలు.. హాస్టల్లో ఉన్న కొడుకును చూడటానికి వచ్చి..

ఖమ్మంలోని పుట్టకోటలో దారుణం.. విడిపోయిన భార్యాభర్తలు.. హాస్టల్లో ఉన్న కొడుకును చూడటానికి వచ్చి..

ఖమ్మం: ఖమ్మంలోని పుట్టకోటలో దారుణం జరిగింది. భార్యపై భర్త పూర్ణచంద్రరావు రాయితో దాడి చేశాడు. బొమ్మ కాలేజ్లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ సమీపంలో ఘటన జరిగింది. భార్యాభర్తలది కూసుమంచి మండలం గురువాయిగూడెం గ్రామం.

సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పూర్ణ చందర్రావు కొడుకు 6వ తరగతి చదువుతున్నాడు. ఆరు నెలలుగా భార్యాభర్తలు వేరువేరుగా ఉంటున్నారు. ఆదివారం కావడంతో.. ఈరోజు అనుకోకుండా ఇద్దరూ, ఒకరికి తెలియకుండా ఒకరు కొడుకును చూసేందుకు పూర్ణ చందర్రావు, అతని భార్య కుమారి వెళ్లారు. కొడుకుకు భోజనం అందించి బయటకు వచ్చి తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 

ఈ గొడవలో విచక్షణ రహితంగా రాయితో కుమారిపై పూర్ణచందర్రావు దాడి చేశాడు. ఈ దాడిలో కుమారి తీవ్రంగా గాయపడింది. దాడి చేసిన పూర్ణచందర్రావును పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడ్డ కుమారిని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమె బంధువులు హైదరాబాద్కు తరలించారు. ఖానాపురం హవేలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.