బీర్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌ లో పార్ట్‌‌‌‌నర్గా తమన్నా..

బీర్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌ లో పార్ట్‌‌‌‌నర్గా తమన్నా..

తమన్నా, డయానా పెంటీ లీడ్ రోల్స్‌‌‌‌లో నటించిన వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ‘డు యూ వనా పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌’.  అర్చిత్‌‌‌‌ కుమార్‌‌‌‌, కాలిన్‌‌‌‌ దర్శకత్వం వహించారు. శుక్రవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  కొత్తగా బీర్ తయారీ వ్యాపారం ప్రారంభించిన ఇద్దరు స్నేహితురాళ్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు అన్నది ఈ సిరీస్ మెయిన్ కాన్సెప్ట్‌‌‌‌. ‘బీర్ అనేది ఆల్కహాల్ కాదు.. అదొక ఎమోషన్‌‌‌‌’ అనే తమన్నా డైలాగ్‌‌‌‌తో ట్రైలర్‌‌‌‌‌‌‌‌ మొదలైంది. ఆ ఎమోషన్‌‌‌‌లో నిండా మునిగేసి ఉదయం లేట్‌‌‌‌గా లేచి ఆఫీస్‌‌‌‌కు వెళ్లడంతో ఉద్యోగం పోతుంది. దీంతో తన ఫ్రెండ్‌‌‌‌తో కలిసి బీర్‌‌‌‌‌‌‌‌ తయారీ బిజినెస్‌‌‌‌లోకి దిగుతుంది. 

ఇష్టమైన డ్రింక్ కనుక ఫుల్‌‌‌‌ జోష్‌‌‌‌గా ఎంట్రీ ఇచ్చిన వాళ్లకు ఆ బిజినెస్‌‌‌‌ అంత ఈజీ కాదని అర్థమవుతోంది. అప్పటికే ఆ రంగంలో ఉన్న పోటీని, పాలిటిక్స్‌‌‌‌ను ఎలా ఎదుర్కొన్నారు.. సక్సెస్‌‌‌‌ అయ్యారా లేదా అన్నది మిగతా కథ. జావేద్ జాఫేరి, నకుల్ మెహతా, నీరజ్ కాబీ, శ్వేతా తివారీ, సూఫీ మోటీవాలా, రణ్‌‌‌‌విజయ్ సింగ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కరణ్ జోహార్‌‌‌‌‌‌‌‌, అదర్‌‌‌‌‌‌‌‌ పూనావాలా, అపూర్వ మెహతా నిర్మించారు.   సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 12 నుంచి అమెజాన్‌‌‌‌ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది.