రైలు బోగీలే కరోనా దవాఖానాలు

రైలు బోగీలే కరోనా దవాఖానాలు

హైదరాబాద్​, వెలుగు: నిరుడు కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు రైలు బోగీలను కరోనా ట్రీట్​మెంట్​ కోసం వాడారు. ఇప్పుడూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో మళ్లీ రైలు బోగీలను ట్రీట్​మెంట్​ సెంటర్లుగా మారుస్తున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక కోచ్​లను సిద్ధం చేసింది. ఆరోగ్య శాఖ గైడ్​ లైన్స్​ ప్రకారం బోగీల్లోని మధ్య బెర్త్​ను తీసేసి ట్రీట్​మెంట్​ సెంటర్లుగా మార్చారు. టాయిలెట్లను షవర్​ రూమ్​లుగా చేంజ్​ చేశారు. కోచ్​లలో బెర్తుకో కూలర్​ను పెట్టారు. బెర్తుల మధ్య ట్రీట్​మెంట్​ చేయాల్సిన పరికరాలు, మందులను పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు.