
-
ట్రైన్లో బ్యాగ్ మర్చిపోయిన మహిళ
-
గుర్తించి తిరిగిచ్చిన లింగంపల్లి రైల్వే పోలీసులు
-
బ్యాగులో రూ.2.38 లక్షల విలువైన గోల్డ్, క్యాష్
చందానగర్, వెలుగు: ట్రైన్లో ఓ మహిళ మర్చిపోయిన హ్యాండ్బ్యాగును లింగంపల్లి రైల్వే పోలీసులు గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఆ బ్యాగ్లో రూ.1.29 లక్షల క్యాష్, లక్ష రూపాయల విలువైన బంగారం ఉంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.నాగపాండు అనే వ్యక్తి తన భార్య లక్ష్మితోఈ నెల 20న భీమవరం నుంచి బయలుదేరిన నర్సాపూర్ఎక్స్ప్రెస్ఎక్కాడు. 21న ఉదయం 7 గంటలకు లింగంపల్లిలో దిగారు. అయితే లక్ష్మి తనతో తెచ్చుకున్న బ్యాగ్ట్రైన్లోనే మర్చిపోయింది.
కొద్దిసేపటి తర్వాత ఆ విషయం గుర్తించింది. అయితే అప్పటికే ట్రైన్ లింగంపల్లి యార్డుకు వెళ్లిపోయింది. బాధితులు వెంటనే లింగపల్లి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్ఫీఎఫ్ ఎస్ఐ బాషా రైల్వే యార్డుకు వెళ్లి మహిళ హ్యాండ్బ్యాగ్ను స్వాధీనం గుర్తించారు. శనివారం ఆమెకు అప్పగించారు. బ్యాగులో రూ.1.29 లక్షల క్యాష్, రూ.1.05 లక్షల విలువైన15 గ్రాముల బంగారు నల్లపూసల దండ, ఒక వాచ్ ఉంది.