
కారేపల్లి, వెలుగు: కోతుల గుంపు కారణంగా విద్యుత్ రైల్వే లైన్ తెగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం జరిగింది. రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కోతుల గుంపు రైల్వే క్యాబిన్ దగ్గర విద్యుత్ తీగలపై అటుఇటు గెంతాయి. ఈ క్రమంలో షాక్‌సర్క్యూట్‌తో ఓ కోతి అక్కడికక్కడే చనిపోగా.. విద్యుత్ వైరు తెగిపోయింది. ఇదే టైంలో కొత్తగూడెం నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న కాకతీయ ఎక్స్‌ప్రెస్ కారేపల్లి స్టేషన్‌కు వచ్చింది. విద్యుత్ లైన్ తెగిన విషయాన్ని గమనించిన సిబ్బంది ట్రైన్‌ను అక్కడే ఆపేశారు. సుమారు గంట పాటు శ్రమించి విద్యుత్ లైన్‌ను పునఃరుద్ధరించిన అనంతరం ట్రైన్ ముందుకు కదిలింది.