రామచంద్రాపురం, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ సర్వీసులు బాగున్నాయని ట్రైనీ ఐఏఎస్ లు కొనియాడారు. శనివారం రామచంద్రాపురం తహసీల్దార్ ఆఫీసును ఒడిశా క్యాడర్‌కు చెందిన ఆరుగురు ట్రైనీ ఐఏఎస్అధికారులు సందర్శించారు. ధరణి పనితీరు, భూ సమస్యల పరిష్కారానికి చేపడుతున్న విధానాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ల్యాండ్ రికార్టులను భద్రపరచడం, భూముల సర్వే, రిజిస్ర్టేషన్ వ్యవస్థ, మ్యుటేషన్ పద్దతులను దగ్గరుండి పర్యవేక్షించారు. తహసీల్దార్సంగ్రామ్ రెడ్డి, అధికారి గోవర్ధన్, రెవెన్యూ సిబ్బంది వారికి పలు విభాగాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీటీ రవి, ఆర్ఐ శ్రీకాంత్ నాయక్, సర్వేయర్రాంభద్ర, సిబ్బంది ధశరథ్, వినీత్, విజయ, స్వాతి, కల్పన, రాములు పాల్గొన్నారు.