మధ్యప్రదేశ్ లో విమాన ప్రమాదం జరిగింది. మంగళవారం (డిసెంబఱ్ 9) సియోనిలో ఓ ప్రైవట్ ఏవీయేషన్ అకాడమీ కి చెందిన శిక్షణ విమానం కూలిపోయింది.. 33KV హైవోల్టేజ్ కరెంటు వైర్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్న పైలట్, ఇన్ స్ట్రక్టర్లకు తీవ్రగాయాలయ్యాయి.
ఇంజిన్ లో సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగిందని అకాడమీ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్ అజిత్ చావ్డా, ఫ్లైట్ ఇన్ స్ట్రక్టర్ అజిత్ ఆంథోని గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ALSO READ : సేమ్ సినిమాల్లో చూపించినట్టే.. కారును ఢీ కొట్టిన థార్.. రెండు సార్లు గాల్లో పల్టీ కొట్టిన కారు !
సియోనిలో రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన విమానం జాతీయ రహదారి-44లోని సుక్తారా ఎయిర్‌స్ట్రిప్ నుంచి 2 కి.మీ దూరంలో ఉన్న అమగాన్ వ్యవసాయ క్షేత్రాల సమీపంలో విద్యుత్ వైర్లను ఢీకొని కూలిపోయిందని పోలీసులు తెలిపారు.
రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా విమానం కింది భాగం బాదల్పర్ సబ్‌స్టేషన్ 33 కెవి విద్యుత్ లైన్‌ను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

