V6 News

సేమ్ సినిమాల్లో చూపించినట్టే.. కారును ఢీ కొట్టిన థార్.. రెండు సార్లు గాల్లో పల్టీ కొట్టిన కారు !

సేమ్ సినిమాల్లో చూపించినట్టే.. కారును ఢీ కొట్టిన థార్.. రెండు సార్లు గాల్లో పల్టీ కొట్టిన కారు !

గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. టోల్ ప్లాజా దగ్గర కారును పక్క నుంచి థార్ ఢీ కొట్టింది. ఈ ఘటన సోహానా-గురుగ్రామ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన CCTVలో రికార్డైంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే విషయంలో క్లారిటీ లేదు గానీ వీడియో అయితే సోమవారం (డిసెంబర్ 8) నుంచి ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఈ వైరల్ క్లిప్‌లో.. కారు టోల్ ప్లాజా దగ్గరకు వస్తుండగా, ఒక బ్లాక్ థార్ వెహికల్ వెనుక నుంచి వచ్చి ఆ కారును ఒక వైపున ఢీ కొట్టింది. థార్ వాహనం అతి వేగంతో ఢీ కొట్టడం వల్ల కారు రెండుసార్లు పల్టీలు కొట్టి.. రోడ్డుపై బోల్తా పడింది. 

ఈ ఘటనలో దారుణమైన విషయం ఏంటంటే.. థార్ వెహికల్ డ్రైవింగ్ చేసిన వ్యక్తి రివర్స్ చేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. కనీసం.. ఆ కారులో ఉన్న వారికి ఏమైందనే కనీస ఆలోచన కూడా లేకుండా తప్పించుకోవడం శోచనీయం. టోల్ ప్లాజా దగ్గర ఉన్న స్థానికులు కారులో ఉన్నవారిని రక్షించడానికి ప్రయత్నించారు. థార్ U-టర్న్ తీసుకొని రాంగ్ రూట్లో అక్కడ నుంచి స్పీడ్గా వెళ్లిపోయింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి థార్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం.