పొలంలో కుప్పకూలిన శిక్షణ విమానం

పొలంలో కుప్పకూలిన శిక్షణ విమానం
  • ముగ్గురు పైలట్లకు గాయాలు

భోపాల్: ఏరియల్ సర్వే కోసం బయలుదేరిన ఓ శిక్షణ విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పొలంలో కుప్పకూలింది. విమానంలో ఉన్న ముగ్గురు పైలట్లు గాయపడ్డారు. హఠాత్తుగా జరిగిన ఘటన నుండి తప్పించుకునేందుకు ముగ్గురు పైలట్లు ప్రయత్నించారు. భోపాల్ సమీపంలోని గాంధీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న బద్వాయి గ్రామం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిందీ ప్రమాదం. భోపాల్ నుండి గుణ వైపు బయలుదేరిన విమానం కొద్దిసేపటికే సాంకేతిక సమస్యతో కుప్పకూలిపోయిందని గాంధీనగర్ పోలీసు స్టేషన్ ఇంచార్జ్ అరుణ్ శర్మ చెప్పారు. గాయపడిన ముగ్గురు పైలట్లను స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించడం జరిగిందని.. వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆయన తెలిపారు.