స్కూల్ అసిస్టెంట్ బదిలీల షెడ్యూల్ రిలీజ్.. రేపు, ఎల్లుండి వెబ్ ఆప్షన్లు

స్కూల్ అసిస్టెంట్ బదిలీల షెడ్యూల్ రిలీజ్..  రేపు, ఎల్లుండి వెబ్ ఆప్షన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) టీచర్ల బదిలీల షెడ్యూల్ రిలీజైంది. మల్టీ జోన్1 పరిధిలోని 19 జిల్లాలతో పాటు హైదరాబాద్ సహా గవర్నమెంట్ సెక్టార్ స్కూళ్లలోని ఎస్​ఏలకు మాత్రమే ఈ ట్రాన్స్​ఫర్లను నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రకటించింది. హైకోర్టులో కేసు నేపథ్యంలో మల్టీజోన్ 2 పరిధిలోని లోకల్ బాడీ స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను నిలిపివేశారు. 

దీంతో ఈనెల 28, 29 తేదీల్లో 20 జిల్లాల్లోని ఎస్ఏలతో పాటు గవర్నమెంట్ సెక్టార్ స్కూల్ టీచర్లు బదిలీల కోసం వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన సూచించారు. 30న ఎడిట్ ఆప్షన్ ఉంటుందని వెల్లడించారు. స్పౌజ్ బదిలీల్లో పాయింట్లు వాడుకునే టీచర్లు.. తప్పనిసరిగా తమ జీవిత భాగస్వామి పనిచేసే దగ్గరలోని స్కూళ్లకు ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. ట్రాన్స్​ ఫర్ ఆర్డర్స్ ఇచ్చే సమయంలో మరోసారి వెరిఫై చేసుకోవాలని ఆదేశించారు.