
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ట్రాన్స్‌ఫర్ చేసిన తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు బదిలీ చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రెసా), తెలంగాణ తహసీల్దార్ల సంఘం (టీజీటీఏ) డిమాండ్ చేశాయి. మంగళవారం నుంచి తాము నిర్వహించనున్న ఆందోళనలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు సంఘాల ప్రతినిధులు వేర్వేరుగా నోటీసులు అందజేశారు. 9వ తేదీ నుంచి వర్క్ టు రూల్ (ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకే విధుల్లో ఉండడం) పాటిస్తామని, అయినా స్పందించకుంటే 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవు పెడతామని నోటీసులో పేర్కొన్నారు సీఎస్ ఎస్‌కే జోషికి నోటీసు ఇచ్చేందుకు టీజీటీఏ రాష్ట్ర ప్రతినిధి బృందం సెక్రటేరియట్‌కు వెళ్లగా.. ఆయన వారికి టైమ్ ఇవ్వలేదు. ఆయన అపాయింట్‌మెంట్ కోసం తహసీల్దార్లు ఐదు గంటలకుపైగా సీఎస్ పేషీలో వెయిట్ చేశారు. సీఎస్ కలవకపోవడంతో ఓఎస్‌డీకి నోటీస్ అందజేశారు.