టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలి

టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలి
  • ప్రభుత్వానికి టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: న్యాయపరమైన చిక్కులను తొలగించి టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్​లో ఆదివారం యూటీఎఫ్​ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రెండోరోజు  ముగిశాయి. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని జంగయ్య కోరారు. 

బడ్జెట్​లో విద్యారంగానికి కేటాయింపులు స్వల్పంగా పెంచడం అభినందనీయమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ లో ఉన్న 4 డీఏలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానికత కోల్పోయిన జీవో 317 బాధిత టీచర్ల సమస్య పరిష్కరించాలని, స్పౌజ్ బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.